కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొవిడ్ రోగులు చాలామంది ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. మృతదేహాలతో శవాగారాలు నిండిపోతున్నాయి. విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రిలో మార్చురీ వద్ద రోజూ ఉదయాన్నే తమ వారి మృతదేహాల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ నంబరు ఇవ్వడానికి, పంచనామా జరగడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఆఖరిచూపు కోసం మృతదేహాల మీద కప్పిన కవరు పైనుంచే చరవాణిలో ఫొటోలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ ఉద్ధృతి వేళ రాష్ట్రంలో ఆంక్షలు