తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని జనసేన అధినేత పవన్ కొనియడారు. కేసీఆర్ చూపించిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగై ఆ వర్గాల్లో ఉపశమనం లభిస్తుందన్నారు. కాపు రిజర్వేషన్‌కు ఎలాగూ వ్యతిరేకం కాబట్టి ఈ విధంగానైనా ఈడబ్య్లూఎస్ అమలు చేస్తే అగ్రవర్ణ పేదలకు కాస్త ఊరట లభిస్తుందని తెలిపారు.
ఇదీచదవండి: సీఎం జగన్‌తో అడ్వొకేట్ జనరల్ భేటీ.. ఎన్నికల నోటిఫికేషన్‌పై చర్చ