విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే.. సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రెండేళ్ల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు ఇప్పించకుండా.. సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ఓ ప్రకటన విడుదల చేశారు జనసేనాని.
ప్రభుత్వ తీరు వల్ల తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోందని అవేదన వ్యక్తం చేశారు. బకాయిలను తక్షణమే ఇప్పించకుండా.. జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామనడం రైతులను వంచించడమేనని స్పష్టం చేశారు. ఈ సమస్యపై రైతుల పక్షాన నిలబడాలని జనసేన పార్టీ నాయకులకు ఇప్పటికే స్పష్టం చేసినట్లు.. పవన్ తెలిపారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే అవకాశం ఉన్నా.. ఆ చట్టాన్నివినియోగించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇదీ చదవండి
Farmers Protest: తిరగబడ్డ చెరకు రైతు.. తమపై దాడికి వచ్చిన పోలీసులను తరిమికొట్టి..