తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత నాయకులతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాలుగు రోజుల నుంచి పవన్ కల్యాణ్ పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని పార్టీ నాయకులూ, వివిధ విభాగాల్లో ఉన్న యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలతో ముఖాముఖి చర్చించారు. 32 మందితో మాట్లాడి.. తెలంగాణలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజాపక్షం వహిస్తూ.. పార్టీ పక్షాన వారు నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తదుపరి తెలంగాణాలో చేపట్టబోయే డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణపై ఈ సందర్భంగా చర్చించారు. రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధతకు అవసరమైన రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, జనసైనికులతో పవన్ ముచ్చటించారు. వారి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. విశాఖపట్నం, రాజోలు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను పవన్ పలకరించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, డివిజన్ స్థాయి సమావేశాల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చారు.
ఇదీ చదవండి: