రాష్ట్ర ఖజానాలోని సొమ్మంతా దిగమింగాలనే దురాలోచన తప్ప కొవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలుకు నిధులు వెచ్చించే ఆలోచన సీఎం జగన్కు లేదని తెదేపా నేత పట్టాభి విమర్శించారు. 18-45 మధ్య వయస్సు వారికి సెప్టెంబర్ వరకూ వ్యాక్సిన్లు అందించలేమని జగన్ చేతులెత్తేయటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. మూడో దశ టీకా పంపిణీకి రాష్ట్రంలో 4 కోట్ల వ్యాక్సిన్లు అవసరమన్న పట్టాభి..,ఇందుకు అవసరమయ్యే రూ. 1600 కోట్లు వెచ్చించకుండా కేంద్రం ఇచ్చే ఉచిత టీకాలపై సీఎం ఆధారపడటం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రానికి మంజూరు చేసిందన్నారు. మరో 300 కోట్లు మూలధన వ్యయ నిధులు విడుదల చేసినా..వ్యాక్సిన్లు ఎందుకు కొనుగోలు చేయట్లేదని నిలదీశారు. డమ్మీ పథకాల ప్రకటనల కోసం బినామీ కంపెనీలకు వందల కోట్లు తగలేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు రూ. 1600 కోట్లు వెచ్చించలేరా? అని ప్రశ్నించారు.
ఇదీచదవండి