ETV Bharat / city

భయపెడుతున్న అవనిగడ్డ రహదారి.. అజాగ్రత్తగా ఉన్నారా అంతే సంగతి..

Damaged Roads In Avanigadda : గజానికో గుంతున్నా మరమ్మతుల మాటే లేదు. భయపెట్టే భారీ బీటలు పడినా కనీస నిర్వహణ ఊసే లేదు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెరసి ఇరు జిల్లాలను కలిపే విజయవాడ, అవనిగడ్డ కీలక రహదారి.. ప్రయాణికుల పాలిట మృత్యుమార్గం మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో దారి లేక ప్రాణాల్ని పణంగా పెట్టి.. బిక్కు బిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Damaged Roads In Avanigadda
Damaged Roads In Avanigadda
author img

By

Published : Sep 19, 2022, 2:31 PM IST

ROADS IN AVANIGADDA : విజయవాడ, అవనిగడ్డ రహదారి మార్గంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన అనేక గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు పంట కాలువ ఉండే ఈ దారిలో.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వాహనం.. కాల్వలోకి దూసుకెళ్లే పరిస్థితి. ఈ రహదారి గుంతలతో పూర్తి అధ్వానంగా మారడంతో.. తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దారుణంగా దెబ్బతిన్న రహదారిపై ప్రయాణించే క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల్లో పడి గాయాలపాలవుతున్నారు.

అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు సహా ప్రైవేటు వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు వేలాదిగా తిరుగుతుంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అందరికి ఉపయుక్తంగా ఉన్న రహదారి.. కొంతకాలంగా ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. భారీ గుంతల వల్ల ఈ మార్గంలో ప్రయాణించాలంటనే వాహనదారులు హడలిపోతున్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలించే టిప్పర్లు, ట్రాక్టర్ల వల్ల పలుచోట్ల రహదారి కుంగిపోయింది. పెద్ద పెద్ద బీటలు పడటంతో.. రహదారి ఎగుడు దిగుడుగా తయారైంది. భారీ వాహనాలు ఎదురుగా వస్తే ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి పంట కాలువలోకి వెళ్లే పరిస్థితి. ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు.

కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి, వేణుగోపాలస్వామి ఆలయం ఈ మార్గంలోనే ఉండటంతో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. రహదారి దుస్ధితి చూసి ఈ మార్గం వెంట వెళ్లాలంటేనే భయపడుతున్నారు. 20కి పైగా గ్రామాలున్న ఈ మార్గంలో.. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా లేవని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇటీవలే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువ వైపు వెళ్లింది. అదృష్టవశాత్తూ కాలువకుకొద్ది దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పరిస్ధితుల్లో రహదారులకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

భయపెడుతున్న అవనిగడ్డ రహదారి.. అజాగ్రత్తగా ఉన్నారా అంతే సంగతి..!!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.