ETV Bharat / city

PASSENGER RAILS: 19 నుంచి పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు

కరోనా విజృంభనతో షెడ్డులకే పరిమితమైన ప్యాసింజర్ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 19 నుంచి పలు మార్గల్లో వీటిని నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్న దృష్ట్యా... కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను జీఎం గజానన్ మాల్యా ఆదేశించారు.

Passenger train
ప్యాసింజర్ రైలు
author img

By

Published : Jul 16, 2021, 10:06 PM IST

కొవిడ్ విజృంభణతో చాలా రోజులుగా షెడ్డులకే పరిమితమైన ప్యాసింజర్ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 19 నుంచి పలు ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 82 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్దరించింది. 16 ఎక్స్​ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది.

కొవిడ్ సెకండ్ వేవ్ రాకతో ప్యాసింజర్ రైళ్లను ఇప్పటివరకు రైల్వే శాఖ నడపలేదు. 19 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్న దృష్ట్యా.. కరోనా వ్యాప్తి చెందకుండా రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణానికి ఆన్​లైన్​లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి స్టేషన్​లోనే టికెట్లు జారీ చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

రైళ్లు, రైల్వే స్టేషన్లలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని దక్షిణ మధ్య రైల్యే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా.. అన్ని డివిజన్ల అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు భౌతికదూరం, ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని జీఎం ఆదేశించారు. చాలా కాలం తర్వాత ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతుండటంతో ఈ నెల 19 నుంచి రైలు స్టేషన్లలో ప్రయాణికుల సందడి మరింత పెరగనుంది.

ఇదీ చదవండి

AP Govt: రాష్ట్ర హక్కులను కేంద్ర గెజిట్​ కాపాడుతుంది: జల వనరుల శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.