విజయవాడకు చెందిన శ్రీనివాస్ తన కుమార్తె ఆన్‌లైన్ చదువు కోసం నెలకు రూ.300 వరకు డేటాకు ఖర్చు చేస్తున్నారు.ఫైబర్ కేబుల్ ఉన్నవారికి నెలకు రూ.500 వరకు వ్యయమవుతోంది. కొన్ని కళాశాలలు ఆన్‌లైన్ తరగతులకు రుసుములు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ రెండో ఏడాదికి రూ.10 వేలు చెల్లించాలంటున్నాయి.
- రూ. 740 కోట్ల వ్యయం!
రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రైవేటు విద్యార్థులు 37 లక్షల వరకు ఉన్నారు. వీరిలో కనీసం 25 శాతం మంది అంటే 9.25 లక్షల మంది కొత్తగా ఫోన్లు, ట్యాబ్‌లు కొంటారు. ఒక్కో ఫోన్‌కు సగటున రూ.8 వేలు ఖర్చు చేస్తారనుకున్నా రూ.740 కోట్లు వ్యయం చేయాల్సిన పరిస్థితి. దీనికి డేటా రీఛార్జి వ్యయం అదనం. - ఆగస్టు వరకు ఇదే పరిస్థితి
* రాష్ట్రంలో ఆగస్టు 3న పాఠశాలలు తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు డిజిటల్ బోధన కొనసాగనుంది.
* ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం పాఠాలను ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. రోజుకు 2 నుంచి 4 గంటలపాటు తరగతులు నిర్వహిస్తున్నాయి.
* వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి, హోంవర్క్‌తోపాటు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారా, హోం వర్క్ చేస్తున్నారా అని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు.
* ఉన్నత విద్యలో యూజీసీ సూచన మేరకు 25 శాతం పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లోనే బోధించేందుకు ప్రణాళిక రూపొందించారు. సగం మందికి కళాశాలలో నేరుగా, మిగతావారికి డిజిటల్ బోధన సాగనుంది.