ETV Bharat / city

ఈ నెలాఖరుతో ‘ఇసుక’ పొరుగు సిబ్బంది తొలగింపు - ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ తాజా వార్తలు

ఈ నెలాఖరుతో ‘ఇసుక’ పొరుగు సేవల సిబ్బందిని తొలిగిపుంకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. వచ్చే నెల నుంచి వీరి సేవలు అవసరం లేదంటూ ఏజెన్సీ తొలగింపునకు నోటీసు మంగళవారం జారీ చేశారు.

dismiss working neighborhood employees of apmdc
ఏపీఎండీసీ పొరుగు సేవల సిబ్బంది తొలగింపు
author img

By

Published : Apr 21, 2021, 9:51 AM IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌లు, నిల్వ కేంద్రాలు, డిపోల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని ఈ నెలాఖరుతో తొలగించేలా ఆదేశాలు జారీచేశారు. 1,922 మంది రెడ్డి ఎంటర్‌ప్రైజెస్‌ అనే ఏజెన్సీ పరిధిలో ఉండగా.. మే ఒకటి నుంచి వీరి సేవలు అవసరం లేదంటూ ఏజెన్సీ తొలగింపునకు నోటీసు మంగళవారం జారీ చేశారు. రాష్ట్రంలోని మూడు జోన్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యత ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో.. ఇకపై పొరుగు సేవల సిబ్బంది, ఏజెన్సీ అవసరం లేదంటూ ఏపీఎండీసీ ఎండీ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. కొత్తగా ఇసుక టెండరు దక్కించుకున్న జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలు మే ఒకటి నుంచి ఆరంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ఇళ్ల స్థలాలకు 3.79 లక్షల కుటుంబాల ఆసక్తి

ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.