ATCHENNA: జూలై 15వ తారీఖు కల్లా రాష్ట్రంలో రోడ్లపై గుంతలు ఉండవని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినట్లు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయని.. కానీ వాటిని మరచిపోయినట్లున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. "అద్దాల్లా మారనున్న రోడ్లు" వంటి కథనాలతో సాక్షి పత్రిక మూడేళ్ల నుంచి వైకాపా అసమర్థతను కప్పిపుచ్చుతుందని ధ్వజమెత్తారు. రేపటికి రాష్ట్రంలో రోడ్లు అన్నీ బాగు చేయించడం మీ వల్ల కాని పని అని.. కనీసం నేడు పత్రికల్లో వచ్చిన చెత్త రోడ్లకైనా రేపటికల్లా మరమ్మతులు చేయగలరా అని నిలదీశారు. రేపటిలోగా వీటిని బాగు చేయించి ప్రజల ఇబ్బందులు దూరం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా? చేతులెత్తేస్తారా? అని ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన చెత్త రోడ్ల ఫొటోలను ఆయన ట్విట్టర్‌కు జత చేశారు.
-
#WorstRoadsInAP#ChatthaRoadsChatthaCM
— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
7/7 pic.twitter.com/smFKRvEHyj
">#WorstRoadsInAP#ChatthaRoadsChatthaCM
— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 14, 2022
7/7 pic.twitter.com/smFKRvEHyj#WorstRoadsInAP#ChatthaRoadsChatthaCM
— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 14, 2022
7/7 pic.twitter.com/smFKRvEHyj
PAWAN KALYAN: రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'హెలికాఫ్టర్లో తిరిగే ముఖ్యమంత్రికి.. రహదారులు అధ్వాన్నంగా ఉన్న విషయం ఎలా తెలుస్తుంది' అనే అర్థం వచ్చేలా ఓ కార్టూన్ని పోస్ట్ చేశారు. రాష్ట్రంలో పాడైపోయిన రోడ్ల గురించి జనసేన తరపున రేపటినుంచి మూడు రోజుల పాటు డిజిటల్ ప్రచారం చేపట్టనున్నారు. దెబ్బతిన్న రోడ్లు, ప్రజల అవస్థలు వివరించేలా జనసేన కార్యకర్తలు ఫొటోలు, వీడియోలు తీసి ముఖ్యమంత్రికి పంపించాలని పవన్ ఆదేశించారు. 'గుడ్ మార్నింగ్ సీఎం సర్' అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ ప్రచారం సాగనుంది.
- — Pawan Kalyan (@PawanKalyan) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2022
">— Pawan Kalyan (@PawanKalyan) July 14, 2022
ఇవీ చదవండి: