తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం(tdp leader nadendla bramham)పై.. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్లో మరో కేసు నమోదైంది. పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ.. జాతీయ రహదారిపై ధర్నా చేయటంతో పాటు పెట్రో డబ్బాతో నిరసన వ్యక్తం చేశారని.. పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆత్మకూరు వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి నాయక్ పై దాడి కేసుకు సంబంధించి.. రెండు రోజుల క్రితం గుంటూరు సబ్ జైల్ నుంచి నాదెండ్ల బ్రహ్మం విడుదలయ్యారు. 21వ తేదీన నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవాళ బ్రహ్మంకు అందింది.
ఇదీ చదవండి: DVC trust: డీవీసీ ట్రస్టుపై ప్రభుత్వం కన్ను.. ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు