విజయవాడ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను కృష్ణలంక పీఎస్ పరిధిలో ఆదివారం అరెస్టు చేశారు. ఈ నగదును విజయవాడ నుంచి గుంతకల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నారు.
నిందితులు లావాదేవీలను హైటెక్ తరహాలో కొనసాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ఎంత నగదు వసూలు చేసుకుని రావాలో ఏజెంట్లకు ఎప్పటికిప్పుడు సమాచారం ఇస్తారని వెల్లడించారు. హవాలా మార్గంలో జరుగుతున్న నగదు రవాణాపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
ఖాకీ సినిమాను తలపించేలా... రాజస్థాన్లో ప్రకాశం పోలీసులపై దాడులు..!