ETV Bharat / city

దైవదర్శనం ముగించుకు వచ్చే లోపే లారీ మాయం

కుటుంబసభ్యులతో కలిసి పూజ చేసుకునేందుకు... ఆయిల్​ ట్యాంకర్​తో ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. దైవదర్శనం చేసుకుని వచ్చేసరికి.. జీవనాధారమైన లారీని ఎవరో అపహరించడంతో నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రిలో జరిగింది.

oil tanker chori in yadadri bhuvanagiri district
దైవదర్శనం ముగించుకున్నాడు... లారీ పోయిందని లబోదిబోమన్నాడు
author img

By

Published : Dec 18, 2020, 2:50 PM IST

తెలంగాణలోని యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆయిల్ ట్యాంకర్ చోరీకి గురైంది. శంషాబాద్​లోని కాటేదాన్​లో నివాసముంటున్న కట్టా రాంరెడ్డి... కుటుంబసభ్యులతో కలిసి ఆయిల్ ట్యాంకర్​(AP13X6731)తో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చాడు. కొండకింద వైకుంఠ ద్వారం సమీపంలో వాహనాన్ని పార్క్ చేసి దర్శనం కోసం వెళ్లారు.

పూజ అనంతరం వచ్చి చూసే సరికి లారీ అక్కడ కనిపించలేదు. దీంతో కంగుతున్న రాంరెడ్డి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు జీవనాధరమైన లారీ చోరీకి గురికావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని తమకు లారీని ఇప్పించాలని వేడుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ టీవీలు పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు సుస్పష్టం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.