ETV Bharat / city

RETAINING WALL: కడతేరనున్న.. కృష్ణా ముంపు కాలనీ వాసుల కష్టాలు..!

RETAINING WALL: కృష్ణా నది దిగువ కాలనీల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పరిష్కారంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. వరదలొచ్చే సమయానికి రక్షణగోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

RETAINING WALL
కడతేరనున్న.. కృష్ణా ముంపు కాలనీల కష్టాలు..!
author img

By

Published : Jun 7, 2022, 2:17 PM IST

RETAINING WALL: కృష్ణా నదికి వరదొస్తుందంటే...... విజయవాడ కృష్ణలంక, తారకరామ నగర్, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్, గీతానగర్‌, యనమలకుదురు ప్రాంతాల ప్రజలకు వణుకే. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తితే... వారికి దినదిన గండమే. ఎప్పుడు వరద ముంచెత్తుతుందో, ఎక్కడ తలదాచుకోవాలో అని ఏటా భయం భయంగా బతుకీడ్చాల్సి వచ్చేది. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలంటూ నదీమతల్లికి చేయని పూజంటూ ఉండేది కాదు. ఈ కష్టాలన్నీ త్వరలోనే తీరనున్నాయి. వరద ముప్పు నుంచి కాపాడే రిటైనింగ్ వాల్ నిర్మాణం శరవేగంగా సాగుతుండటంతో... వరద ప్రభావిత కాలనీలకు ఉపశమనం లభించనుంది.

కడతేరనున్న.. కృష్ణా ముంపు కాలనీల కష్టాలు..!

కృష్ణా ముంపు తప్పించేలా రక్షణగోడ నిర్మించమంటూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు... కొన్ని దశబ్దాలపాటు పోరాడారు. వారి మొర ఆలకించిన చంద్రబాబు ప్రభుత్వం... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పూనుకుంది. ఆమేరకు నిధులు కేటాయించి... పనులు ప్రారంభించింది. 2019 ఎన్నికల నాటికి... యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు ఫేజ్-1 పనులు పూర్తిచేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో దాదాపు రెండేళ్ల విరామం వచ్చింది. గతేడాది మార్చి 31న ఫేజ్‌-2 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గీతానగర్‌ కట్ట నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. జులై నాటికి పూర్తిచేస్తామని గుత్తేదారు సంస్థ ఇంజినీర్లు చెబుతున్నారు.

ఫేజ్‌-1 నిర్మాణం పూర్తయిన ప్రాంతంలోని ప్రజలు... ముంపు ముప్పు తప్పిందని ఇప్పటికే సంతోషంగా ఉన్నారు. ఫేజ్‌-2 కూడా అనుకున్న సమయానికి పూర్తిచేస్తే... వరదల బాధ తీరినట్టేనని మిగిలిన కాలనీల ప్రజలు అంటున్నారు. రక్షణ గోడ నిర్మాణంతో దిగువ ప్రాంతంలో వందల మంది ఇళ్లు కోల్పోయారు. పునరావాసం కల్పిస్తామన్న అధికారులు... కొందరికి మాత్రమే గూడు చూపించారని బాధితులు వాపోతున్నారు. అందరికీ ఇళ్లు కట్టించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.