ETV Bharat / city

నందిగామ పరిధిలో.. పన్ను కట్టనివారి ఆస్తులు సీజ్! - నందిగామలో పన్నులు చెల్లించనివారి ఆస్తులను సీజ్​ చేస్తున్న అధికారులు

seized untaxed homes: నందిగామ పంచాయతీ పరిధిలో పన్నులు చెల్లించనివారి ఇళ్లు, విద్యా, వ్యాపార సంస్థలను అధికారులు సీజ్​ చేస్తున్నారు. మధిర రోడ్డులోని ఓ కళాశాల రూ.17 లక్షల పన్ను బకాయి చెల్లించలేదని ప్రధాన గేటుకు తాళం వేశారు. అధికారుల తీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

seized untaxed homes:
పన్నులు చెల్లించని ఆస్తులు సీజ్​
author img

By

Published : Mar 23, 2022, 2:08 PM IST

Updated : Mar 23, 2022, 4:10 PM IST

seized untaxed homes: కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలో పన్నులు చెల్లించనివారి ఇళ్లు, విద్యా, వ్యాపార సంస్థలను అధికారులు సీజ్ చేస్తున్నారు. నందిగామ మధిర రోడ్డులోని కళాశాల రూ.17 లక్షల పన్ను బకాయి కట్టలేదని.. కాలేజీ ప్రధాన గేటుకు తాళాలు వేసి సీలు వేశారు. ఓ కోల్డ్ స్టోరేజ్​కు రూ.7లక్షల పన్ను బకాయి ఉండటంతో దానికీ సీలు వేశారు. స్థానిక చెరువు బజారులో మూతపడి ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్​ను సీజ్​ చేశారు.

పన్నులు చెల్లించని ఆస్తులు సీజ్​

తాగునీటి కుళాయి పన్నులు చెల్లించనివారి ఇళ్ల వద్ద నీటి కుళాయిలను ఆపేశారు. అధికారుల తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమయం ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఉద్యమానికి తెదేపా పిలుపు.. నేతల గృహ నిర్బంధం

Last Updated : Mar 23, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.