మార్షల్ ఆర్ట్స్‌ను విద్యలో భాగం చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai) అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే డిఫెన్స్ నేర్పించాలన్నారు. ధైర్యానికి ప్రతీక అయిన ఎన్‌ఎస్‌జీ(National Security Guard) వంటి సంస్థల్లో యువత చేరాలని సూచించారు. ఎన్‌ఎస్‌జీ(National Security Guard) వల్ల దేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrut Mahotsav)'లో భాగంగా ఈనెల 2న ప్రారంభమైన 'సుదర్శన్ భారత్ పరిక్రమ(Sudarshan Bharat Parikrama)' యాత్ర హైదరాబాద్ చేరుకుంది. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ క్యాట్ ర్యాలీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai) ప్రారంభించారు. ఈ ర్యాలీ దేశంలోని 18 నగరాల మీదుగా 7,500 కిలోమీటర్లు ప్రయాణించి అక్టోబర్ 30న దిల్లీ చేరుకోనుంది. దిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద ముగియనుంది.
బ్లాక్ క్యాట్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్(Telangana Governor Tamilisai).. దేశభద్రతలో ఎన్‌ఎస్‌జీ(National Security Guard) పాత్ర గురించి మాట్లాడారు. ఈ ర్యాలీ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్నో గొప్ప ఆపరేషన్లను ఎన్‌ఎస్‌జీ విజయవంతంగా నిర్వహించిందని ఉద్ఘాటించారు. ఎన్‌ఎస్‌జీ(National Security Guard) వంటి వాటి వల్ల దేశప్రజలు భద్రతాభావంతో ఉంటున్నారని చెప్పారు. ఎంతో మంది యువకులు.. ఎన్ఎస్జీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తమిళిసై (Telangana Governor Tamilisai) పేర్కొన్నారు.
"ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ ర్యాలీని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ర్యాలీ దేశభక్తిని, ఐక్యతను చాటిచెబుతోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ర్యాలీ హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కణ్నుంచి తర్వాత చెన్నైకి వెళ్తోంది. ఎన్‌ఎస్‌జీ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. దేశభద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశాన్ని ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఎలా రక్షిస్తున్నారో.. అలాగే పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి ప్రతి పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్‌ని భాగం చేయాలి."
- తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్
ఇదీ చదవండి: విద్యుత్ కోతలపై దుష్ప్రచారం.. వారిపై కఠిన చర్యలుంటాయ్: బాలినేని