చికాగో నుంచి ఉదయం హైదరాబాద్‌కు 31 మంది తెలుగువారు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బస్సుల్లో విజయవాడకు వచ్చారు. వారికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. 31 మందికి వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.
- ప్రవాసాంధ్రుల్లో ..
కృష్ణా-ఏడుగురు, తూర్పుగోదావరి-ఐదుగురు, కర్నూలు-నలుగురు, ప్రకాశం-నలుగురు, చిత్తూరు-ముగ్గురు, పశ్చిమగోదావరి-3, నెల్లూరు-2, కడప, అనంతపురం, గుంటూరు నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.
వలస కూలీలను రైలులో అసోం, మణిపూర్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారిని జిల్లాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.