ETV Bharat / city

గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్

author img

By

Published : Apr 22, 2020, 2:58 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నియామక ప్రక్రియ మే 1 నాటికి పూర్తి చేయనున్నారు.

గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్
గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు 10వ తరగతి , గ్రామాల్లో ఇంటర్, పట్టణాల్లో అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసించేవారై ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారై ఉండాలని తెలిపారు. అర్హులైన వారు ప్రభుత్వ వెబ్‌సైట్‌ (https://gswsvolunteer.apcfss.in/)లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నియామక ప్రక్రియ మే 1 నాటికి పూర్తి చేయనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.కన్నబాబు మార్గదర్శకాలు జారీ చేశారు.

ముఖ్యతేదీలు

దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 24 వరకు

ఇంటర్వ్యూలు ఏప్రిల్ 27 నుంచి 29 వరకు

ఎంపికైన వారికి సమాచార లేఖల జారీ ఏప్రిల్ 27 నుంచి 29 వరకు

నియామకం మే 1

ఇదీచదవండి

రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.