ETV Bharat / city

కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు.. ఏడు నెలలుగా జీతాల్లేక అవస్థలు - కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్ల

అందరి కళ్లలో వెలుగులు నింపుతున్న కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. మారుమూల గ్రామాలకూ వెళ్లి విధులు నిర్వహిస్తున్నా.. నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. వేతన సమస్యలపై వైద్యశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించిన సిబ్బంది... బకాయిలు చెల్లింపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు
కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు
author img

By

Published : Jul 14, 2022, 3:51 AM IST

కంటివెలుగు సిబ్బంది జీవితాల్లో చీకట్లు

ప్రజల కంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు పథకంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు.. 7 నెలలుగా వేతనాలు అందక అల్లాడుతున్నారు. ఇచ్చే 13 వేల జీతం కూడా సకాలంలో రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై పూటగడవని స్థితికి చేరుకున్నామని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని గొల్లపూడిలోని వైద్యశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించిన ఉద్యోగులు.. వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.

జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా 2019లో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో ఆప్తమాలజీ అసిస్టెంట్లను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 220 సిబ్బంది పనిచేస్తున్నారు. రవాణా సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు సైతం సొంత ఖర్చులతో వెళ్లి సేవలందిస్తున్నా.. ఒకవైపు సంక్షేమ పథకాలకు దూరమై, ఇంకోవైపు ఉద్యోగ భద్రత లేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు.

ఉద్యోగ ఒప్పందం ముగిసినా పొడిగింపునపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఉద్యోగులు అంటున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని జోక్యం చేసుకుని... తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.