Nithin Gadkari: విజయవాడకు తూర్పున 78 కిలోమీటర్ల బైపాస్ రహదారి నిర్మాణానికి.. ఏపీ ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పినట్లు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వాటికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన తర్వాతే రహదారి నిర్మాణ ఫీజిబిలిటీని నిర్ణయించి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. లోక్సభలో వైకాపా ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, శ్రీధర్ కోటగిరి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. విశాఖపట్నం పోర్టు నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురానికి ఆరువరుసల రహదారి నిర్మాణానికున్న సాధ్యాసాధ్యాలను విశ్లేషించడం కోసం డీపీఆర్ తయారు చేస్తున్నట్లు చెప్పారు.
ఫాస్టాగ్ వ్యవస్థ వల్ల టోల్ ప్లాజ్ల వద్ద ఒక్కో వాహనం వెళ్లడానికి సగటున 47 సెకెండ్ల సమయం పడుతున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలుగుదేశం ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా మంత్రి సమాధానమిచ్చారు. జాతీయ రహదారుల మానిటైజేషన్ ద్వారా జాతీయరహదారుల అభివృద్ధి సంస్థకు తొలి విడతలో రూ.7 వేల 350 కోట్ల ఆదాయం వచ్చినట్లు.. అమలాపురం వైకాపా ఎంపీ చింతా అనూరాధ ప్రశ్నకు గడ్కరీ బదులిచ్చారు.
ఇదీ చదవండి: