రైతుల్ని మర్చిపోయిన వైకాపా ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రెండేళ్లలో దొంగ లెక్కలతో కాలక్షేపం చేస్తూ అన్నదాతల్ని దగా చేశారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన 15అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కౌలు రైతులకు కులం అంటగట్టి ప్రభుత్వ పథకాలు దూరం చేశారని ఆక్షేపించారు. ధాన్యం బకాయిలు కూడా సకాలంలో చెల్లించకుండా వందలాది కోట్లు బకాయిలు పెండింగ్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రయోజనాలు దెబ్బతీసేలా నీటి సామర్థ్యం ఎత్తు తగ్గించి రైతుల్ని మోసగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కౌలు రైతు ఆత్మహత్యల్లో ఏపీని 3వ స్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చాలనుకోవటం తగదు: కొల్లు రవీంద్ర