ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ఆటలు కట్టేందుకు సిద్ధమైంది రాష్ట్ర రవాణా శాఖ. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు చేసిన తనీఖీల్లో వాహన విక్రయ డీలర్ల బాగోతాలు వెలుగుచూశాయి. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం రేటును తక్కువగా చూపించి ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తోన్న వారిపై దాడులు కొనసాగుతున్నాయని రవాణాశాఖ కమిషనర్ పి.సీతా రామాంజనేయులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వాహన విక్రయ డీలర్లపై ఏకంగా 200 శాతం వరకు జరిమానా విధించా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని ఆయన వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా... రోడ్డు భద్రత కోసం ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిందని కమీషనర్ తెలిపారు.
ఇదీ చూడండి:ప్రకృతిపై ప్రేమతో ...వృక్షా బంధన్