రాష్ట్ర ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మరిన్ని 108,104 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. అధునాతన సౌకర్యాలతో కూడిన వెయ్యి 60 వాహనాలు జులై 1 న రోడ్డెక్కనున్నాయి. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కొత్త వాహనాలను ముఖ్యమంత్రి జగన్... జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికీ వైద్యసేవలు విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం....ఇటీవలే కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. వీటి కోసం వాహన డ్రైవర్లు, సిబ్బంది నియామకం ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు.
జులై 1న కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించనున్న సీఎం జగన్ - ap govt ambulanes latest news
రాష్ట్రంలో మరిన్ని అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త 108,104 వాహనాలను జులై 1న సీఎం జగన్ ప్రారంభించనున్నారు.