రాష్ట్రంలో కొత్తగా 545 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 8,62,758కు చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 10 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,948కు చేరింది. మరో1,390 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.42 లక్షల మంది వైరస్ను జయించారు. ఏపీలో ప్రస్తుతం 13,394 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 47,130 కొవిడ్ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 97.62 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు హెల్త్ బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: