ఏపీ, ఒడిశా సీఎంలతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో చిక్కుకున్న ఒడిశా కూలీలు, కార్మికులను ఆదుకున్నందుకు ఈ సందర్భంగా సీఎం జగన్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ధన్యవాదాలు తెలిపారు. 2 రాష్ట్రాల్లోని వలస కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై ముగ్గురూ చర్చించారు. ఏపీ నుంచి ఒడిశాకు... అలాగే ఒడిశా నుంచి ఏపీకి కూలీలను పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.
ఇదీ చదవండి: