సఫాయి కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం : వాల్జీభాయ్ జాలా ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య కార్మికుల స్థితిగతులను పరిశీలించి, వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా కృషి చేయనున్నట్లు జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఛైర్మన్ మన్ హర్ వాల్జీభాయ్ జాలా అన్నారు. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులతో కలిసి ఆయన నగరంలో పర్యటించారు. విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన... పారిశుద్ధ్య కార్మికులు, నగర పాలక సంస్థ యూనియన్ నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, ప్రభుత్వాల నుంచి వారికి అందుతున్న చేయూతను సంఘ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సంఘ ప్రతినిధులు పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఎలాంటి భద్రత, రక్షణ లేకుండా జీవిస్తున్నారని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. జీతభత్యాలు సరిగా ఇవ్వడం లేదని, గుర్తింపు లేదని, అనారోగ్యాల బారిన పడుతున్నా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని కమిషన్ సభ్యుల ముందు వాపోయారు.
గుంటూరు పర్యటన
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం కృషి చేయాలని మన్ హర్ వాల్జీభాయ్ జాలా కోరారు. గుంటూరులో పర్యటించిన ఆయన... జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్తో కలిసి సఫాయి కర్మచారులకు అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.
ఇదీ చదవండి :
ఎలుగుబంట్లు సంచారం... బాతుపురంలో భయంభయం...