ఆంధ్రప్రదేశ్లో రోజుకో అమానవీయ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు, బాధలు ఎవరితో చెప్పుకోవాలని నిలదీశారు.
గుంటూరు ఎటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్న ఘటన రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే.. కానిస్టేబుల్ పాల్పడ్డాడా అనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వెయ్యకుండా కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని, సమాజానికి జగన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారని లోకేశ్ నిలదీశారు.
ఇదీ చదవండి: