కులమతాలకు అతీతంగా కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ట్రస్ట్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ 782 మందికి పైగా రోగులకు నిపుణులైన వైద్యులతో ఆన్లైన్ ద్వారా వైద్య సేవలు అందిస్తే.. 480 మంది కోలుకున్నారని భువనేశ్వరి తెలిపారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 24గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ను అందుబాటులో ఉంచటంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ద్వారా 78 వేల మందికి ఆహారం అందించామన్నారు. అనాథలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ మానవ సేవే-మాధవ సేవ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ట్రస్టు సీఈవో రాజేంద్రప్రసాద్, వైద్యులు లోకేశ్వరరావు, నిరంజన్ మోటూరి, శేషగిరి, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి
RRR: రఘురామరాజును డిస్క్వాలిఫై చేయండి: స్పీకర్‌కు ఎంపీ భరత్ ఫిర్యాదు