ETV Bharat / city

కిరణ్ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి: లోకేశ్ - జాతీయ ఎస్సీ కమిషన్​కు లేఖ రాసిన నారా లోకేశ్ న్యూస్

పోలీసుల దాడిలో ఏడు నెలల క్రితం చనిపోయిన చీరాలకు చెందిన ఎస్సీ యువకుడి కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని తెదేపా నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పుపడుతూ.. జాతీయ ఎస్సీ కమిషన్​కు లోకేశ్ లేఖ రాశారు.

nara-lokesh-wrote-a-letter-to-the-national-sc-commission
కిరణ్ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి: లోకేశ్
author img

By

Published : Feb 6, 2021, 7:33 PM IST

చీరాలకు చెందిన ఎస్సీ యువకుడు కిరణ్.. ఏడు నెలల క్రితం పోలీసుల దాడిలో మరణించాడు. అతని కుటుంబానికి సత్వర న్యాయం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తూ.. జాతీయ ఎస్సీ కమిషన్​కు లేఖ రాశారు. ఇంతవరకూ బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పుపట్టారు.

మాస్క్ పెట్టుకోని కారణంగా పోలీసులు.. కిరణ్​ను కొట్టడంతో మరణించాడని అతని కుంటుంబ సభ్యులు ఆరోపించారు. ఏడు నెలలుగా దీనిపై యువకుడి తల్లిదండ్రులు న్యాయపోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని లోకేశ్ విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎలాంటి ఆర్థికసాయమూ.. అందించలేదని అన్నారు. ఈ మేరకు కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఎస్సీల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేదని లోకేశ్ పేర్కొన్నారు. దళితులపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అయ్యాయని చెప్పారు. దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవటమే ఉత్తమైన మార్గమమని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పెరిగిన ధరలను తగ్గించాలి: బోండా ఉమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.