అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో యువతి హత్య.. తీవ్రంగా కలిచి వేసిందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం వల్లే తన బిడ్డ హత్యకు గురైందంటూ.. ఆమె తల్లి పడుతున్న బాధ వర్ణణాతీతమని విచారం వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. మహిళల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ మొద్దునిద్ర వల్లే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. యువతిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని.. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
దేవుడి సాక్షిగా.. అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏమని ప్రమాణం చేశారంటే?