శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విజయవాడలో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
"లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. వందల ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన నిరుద్యోగుల్ని తక్షణమే విడుదల చేయాలి. జగన్ పాలనలో తమకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా నిరసన తెలపడం కూడా నేరంగా పరిగణించడం దారుణం" అని ట్విట్టర్ ద్వారా లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి..
AP cabinet : తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు: సీఎం జగన్