ETV Bharat / city

విద్యార్థుల జీవితాలకే ముఖ్యమంత్రి పరీక్ష పెడుతున్నారు: లోకేశ్

రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మందికి కరోనా ముప్పు పొంచి ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. మొండి వైఖరితో విద్యార్థుల జీవితాలకే ముఖ్యమంత్రి పరీక్ష పెడుతున్నారని ధ్వజమెత్తారు. పరీక్షకు హాజరయ్యే ఏ ఒక్క విద్యార్థికి కరోనా సోకదని సీఎం గ్యారెంటీ ఇస్తారా? అని నిలదీశారు.

nara lokesh online meeting on exams
nara lokesh online meeting on exams
author img

By

Published : Apr 22, 2021, 4:45 PM IST

పది, ఇంటర్​ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జూమ్ ద్వారా వైద్యులు, విద్యార్థులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులతో నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. 'పది, ఇంటర్ పరీక్షలకు 15 లక్షల మంది విద్యార్థులు, 30వేల మంది బోధనా సిబ్బంది, మరో లక్షన్నర మంది వరకూ బోధనేతర, ఇతర సిబ్బంది హాజరుకావాల్సి ఉంటుంది. ఒక్కో కుటుంబంలో అయిదుగురు చొప్పున చూసుకున్నా దాదాపు 80 లక్షల మందికి కరోనా ముప్పు ఈ పరీక్షల వల్ల పొంచి ఉంది. కరోనా భయంతో తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లని సీఎం, పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు ఎలా పంపుతారు. దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేయటం.. లేదా రద్దు చేయటం చేశాయి. 50 మంది వరకూ ఉపాధ్యాయులు మన రాష్ట్రంలో చనిపోయారు.' అని నారా లోకేశ్ అన్నారు.

ప్రతి వంద మందిలో 24 మందికి కరోనా పాజిటివ్ వస్తోందని నారా లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తూ మూర్ఖపు రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. ఆన్​లైన్​లో క్లాసులకు హాజరై ఆఫ్​లైన్​లో పరీక్షలకు వెళ్లిన విద్యార్థులు కరోనా బారిన పడిన ఉదాహరణలు ఉన్నాయన్నారు. పిల్లల నుంచి తల్లిదండ్రులకు కరోనా వ్యాప్తి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా మొదటి దశను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లోకేశ్ అన్నారు. రెండో దశలోనూ అదే ధోరణి వల్ల ఎక్కడా అసుపత్రుల్లో పడకలు దొరకట్లేదన్నారు. జూన్​లో కరోనా మరింత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ కొరతతో ఐదుగురు మృతి!

అభిప్రాయాల సేకరణకు ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు

పరీక్షల నిర్వహణపై తల్లిదండ్రులు, విద్యార్థులు తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రత్యేక వాట్సప్ నెంబర్​ను లోకేశ్ విడుదల చేశారు. 9444190000 నెంబర్​కు తమ అభిప్రాయాలను పంపాలని కోరారు. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే వివిధ రూపాల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైద్యులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

మాస్క్ తో పోయేదాన్ని వెంటిలేటర్ వరకూ తెచ్చుకోరాదు: ఎయిమ్స్ వైద్యురాలు మణిపవిత్ర

'గోటితో పోయేదాన్ని గొడ్డలితో తెచ్చుకోకూడదనే రీతిలో మాస్క్​తో పోయేదాన్ని వెంటిలేటర్ దాకా తెచ్చుకోకూడదు. పిల్లలకు జ్వరం వస్తేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఇప్పుడు కరోనా స్వైరవిహారం చేస్తుంటే పరీక్షల నిర్వహణ తగదు. రెండో దశ స్ట్రైయిన్ విద్యార్థుల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. మొదటి దశతో పోల్చితే 3 రెట్లు అధికంగా రెండో దశ ప్రభావం ఉంది. ఈ దశలో పరీక్షలు సబబు కాదు. పరీక్షలు జరగకుండా పోరాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.' అని ఎయిమ్స్ వైద్యురాలు మణిపవిత్ర అన్నారు.

ఇదీ చదవండి: ఈ పరికరంతో 2 నిమిషాల్లోనే కరోనా ఫలితం!

విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి: చరణ్, విద్యావేత్త

'పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు ప్రామాణికం కాదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు ఇదో సదవకాశంగా భావించాలి. మొండి వైఖరి కంటే మానవత్వం ఎంతో ముఖ్యం. ప్రపంచం మొత్తం ఓపెన్ బుక్ పరీక్షా విధానాలు వస్తున్నాయి. లైఫ్​కు రీయింబర్స్​మెంట్ ఉండదన్నది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితి జీవితాల్ని మార్చే విధంగా ఉంది. పరీక్షల నిర్వహణ కంటే విద్యావిధానంలో మూర్పు దిశగా ఆలోచనలు రావాలి.' అని చరణ్ తెలిపారు.

పరీక్షలు నిర్వహణపై ఓటింగ్ పెట్టాలి: ఇందిరా ప్రియదర్శిని, విద్యార్థి తల్లి

'పరీక్షల నిర్వహణపై తల్లిదండ్రులకు ఓటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. పిల్లల్లో పెరుగుతున్న కరోనా ముప్పుపై ఈనాడు కథనం అందరినీ అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షకు సరైన పరికరాలు కూడా దొరకట్లేదు. రెండో దశ టీకా దొరక్క ఎదురుచూస్తున్నాం. మా కుటుంబంలోనే ఆరుగురు కరోనా రోగులు ఉన్నారు. ఇంత ఒత్తిడిలో పరీక్షల నిర్వహణ మానసికంగా కృంగదీస్తోంది. తల్లిదండ్రుల్ని డైలమాలో పడేయటం తగదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లే రవణా వల్లా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు.

ప్రాక్టికల్ పరీక్షలు వల్ల చాలా మంది కరోనా బారిన పడినా.. విషయం బయటకు రాలేదని పలువురు విద్యార్థులు చెప్పారు. పాజిటివ్ వచ్చినా ఎవరికీ చెప్పొద్దు అని విద్యార్థులను బెదిరిస్తున్నారన్నారు. పరీక్షల నిర్వహణలో కరోనా నివారణకు ఎక్కడా జాగ్రత్తలు పాటించలేదని తెలిపారు. విద్యార్థులుగా ఎండాకాలంలో గంటల పాటు మాస్క్ లు ధరించి ఉండటం చాలా కష్టమని.. కరోనా టెస్టుకు నమూనాలు ఇచ్చి ఫలితాలు ఆలస్యమవటంతో పాజిటివ్ వచ్చినా.. అనేకమంది బయట తిరిగేస్తున్నారని విద్యార్థులు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.