పొలీసు వాహనాలకు వైకాపా రంగులా! పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే.. త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు. రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు.. శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృథా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది.
- నారా లోకేశ్, తెదేపా ప్రధాన కార్యదర్శి
ఇదీ చదవండి: సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం