ETV Bharat / city

అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు: లోకేశ్‌

తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబుపై.. ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితికి వైకాపా దిగజారిందని ఆగ్రహించారు.

nara lokesh fires on ysrcp
nara lokesh fires on ysrcp
author img

By

Published : Mar 16, 2021, 12:08 PM IST

Updated : Mar 16, 2021, 6:25 PM IST

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేకసార్లు చీవాట్లు పెట్టినా.. వైకాపా పాత పాటే పాడుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుకు.. సీఐడీ నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"21 నెలలపాటు శోధించి అలసిపోయి.. ఆఖరికి జగన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు" అని మండిపడ్డారు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనను తానే కాపాడుకుంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Last Updated : Mar 16, 2021, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.