ETV Bharat / city

శవ రాజకీయాలకు సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్​ : లోకేశ్ - ప్రభుత్వంపై లోకేశ్ కామెంట్స్

కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్​గా మారారని ఆయన ధ్వజమెత్తారు.

లోకేశ్
లోకేశ్
author img

By

Published : Mar 14, 2022, 9:03 PM IST

శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్​గా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని విమర్శించారు. కల్తీ మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా అని నిలదీశారు.

రాష్ట్రంలో మద్యం దుకాణాల కాలపరిమితిని పెంచి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆరోపించారు. పేద ప్రజలు అధిక ధరలకు సర్కారీ మద్యం కొనలేక కల్తీసారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కల్తీసారా మరణాలపై న్యాయ లేదా సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు డిమాండ్ చేశారు. కల్తీ సారా మరణాలకు జగన్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని మరో ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, బీటెక్ రవి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.