ETV Bharat / city

సీఎం జగన్ పాలనలో నేతన్నలకు తీవ్ర కష్టాలు: లోకేశ్ - నేతన్నల కష్టాలపై లోకేశ్ స్పందన

జగన్ పాలనలో నేతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని నారా లోకేశ్ మండిపడ్డారు. కరోనా, వర్షాలతో నష్టపోయిన నేతన్నలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

nara lokesh about weavers problems
నారా లోకేశ్
author img

By

Published : Aug 30, 2020, 12:56 AM IST

జగన్ పాలనలో నేతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. క‌రోనా, వ‌ర్షాల‌తో చేనేత‌ రంగంలో సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలో 2,490 మ‌గ్గాలు ఉన్నాయని, ప‌రోక్షంగా 50 వేల మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. 6 నెల‌లుగా ప‌నిలేక వేత‌నాల్లేని నేత‌ కార్మికుల‌ను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

పట్టణంలో 284 మందికే నేత‌న్న నేస్తం అందించారని, సొంత మ‌గ్గం ఉన్నవారికే నేతన్న నేస్తం అంటూ మెలిక పెట్టి, వేలాది మంది నేతన్నలను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కష్టాలకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు..

ఇవీ చదవండి...

ప్రమాదవశాత్తు నాగార్జున సాగర్​ కాలువలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.