తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తైంది. సాగర్ ఉపఎన్నికకు మొత్తం 77 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అధికారులు.. 17 నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. మిగతావారి నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు వివరించారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 దాకా గడువు ఉంది. ఏప్రిల్ 17న సాగర్ పోలింగ్ జరగనుండగా... మే 2న ఫలితం తేలనుంది.
ఇదీ చూడండి: తిరుపతి ఉపఎన్నిక: ప్రచారంలో దూసుకెళ్తున్న అభ్యర్థులు