ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అధికార అహంకారంతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
జనసేన ఆవిర్భావ సభ జరిగే ఇప్పటం గ్రామంలో మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అన్నారు.
"రేపు మధ్యాహ్నం 3 గం.కు జనసేన సభ. రేపటి సభలో జనసైనికులకు పవన్ దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాడాల్సిన బాధ్యత మాకుంది. సభకు ఆటంకం కలిగించవద్దని అధికారులను కోరుతున్నా. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వ్యక్తి పవన్. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో పవన్ దిశానిర్దేశం చేస్తారు. జగన్ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే ఈ సభ. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యం."- నాదెండ్ల మనోహర్, జనసేన సీనియర్ నేత
ఇదీ చదవండి