ETV Bharat / city

వైద్య సిబ్బందికి నెల జీతం అడ్వాన్స్​గా ఇవ్వాలి: నాదెండ్ల - నాదెండ్ల మనోహర్ తాజా వార్తలు

కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని జనసేన ఆరోపించింది. వైద్య సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవటంపై ఆ పార్టీ రాజకీయ వ్యహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విచారం వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

వైద్య సిబ్బందికి ఒక నెల జీతం అడ్వాన్స్​గా ఇవ్వాలి: నాదెండ్ల

author img

By

Published : Sep 14, 2020, 6:17 PM IST

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని జనసేన ఆరోపించింది. కోవిడ్-19 విధుల కోసం నియమించుకున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతోపాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవటంపై ఆ పార్టీ రాజకీయ వ్యహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విచారం వ్యక్తం చేశారు. కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడిపోతున్న సమయంలో ఎంతో ధైర్యంగా వృత్తిపట్ల నిబద్ధతతో విధులకు హాజరైన వారికి కనీసం జీతం ఇవ్వకపోవటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.

పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు ఇవ్వడం లేదని వైద్యులు, నర్సులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారన్నారు. వైద్యుడు సుధాకర్ ఉదంతం ఇందుకు సంబంధించినదేనని గుర్తు చేశారు. తెనాలిలో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారని తెలియగానే జనసేన వారికి అవసరమైన శానిటైజర్లు, కిట్లు అందచేసిందన్నారు. నాదెండ్ల పీహెచ్​సీలోని వైద్యుడు తమ సమస్యను చెబితే అరెస్ట్ చేయమని కలెక్టర్ ఆదేశించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇలాంటి చర్యలు వైద్య సిబ్బంది మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయని ఆక్షేపించారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి తక్షణమే బకాయి జీతాలు చెల్లించాలని...,ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఉన్నత స్థాయి వైద్య అధికారి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బందికీ ఒక నెల జీతం అడ్వాన్స్​గా ఇవ్వాలని మనోహర్ డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.