Municipal workers Protest: సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు 'చలో విజయవాడ' చేపట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి విజయవాడకు తరలివస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ కార్మికులు, సీఐటీయూ నాయకులను పోలీసులు అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ.. పోలీస్ స్టేషన్ ముందు మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడ వెళ్తున్న తమను అరెస్ట్ చేయటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విధులు నిర్వహించుకుని వస్తుండగా అరెస్ట్
ప్రకాశం జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల నుంచి కార్మికులు విజయవాడ వెళ్లకుండా ఎక్కడికక్కడే నియంత్రించారు. ఒంగోలు కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్లే సమయంలో.. పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి నిరసన తెలిపే హక్కునూ ప్రభుత్వం ఇవ్వకపోవడం శోచనీయమని, పోలీసుల తీరు అన్యాయమని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: