ETV Bharat / city

Talented Girl: ప్రసంగాలతో పాటు సంగీతంలో 'పల్లవి'స్తున్న ప్రతిభ

author img

By

Published : Feb 19, 2022, 11:56 AM IST

Pallavi: సమాజంలో చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న దురాగతాలపై తన గొంతు ప్రతిధ్వనిస్తోంది.. 9వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి ఏ వేదిక ఎక్కినా తనదైన శైలిలో మాట్లాడుతూ వీక్షకులను ఆకర్షిస్తోంది.. 60 నిమిషాల్లో 60 అంశాలపై అనర్గళంగా మాట్లాడి అదరగొట్టింది.. ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. ఇంతకీ తను ఎవరో తెలుసుకుందామా...

Pallavi
పల్లవి

ప్రసంగాలతో పాటు సంగీతంలో 'పల్లవి'స్తున్న ప్రతిభ

Pallavi: అటు ప్రసంగాల్లో ఇటు సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది.. మరోవైపు నాట్యంలో అద్భుతంగా రాణించి అంతర్జాతీయ, జాతీయ అవార్డులు సాధించింది. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది. ఆర్థికంగా దీనస్థితిలో ఉన్న తనలాంటి వారిని ఆదుకోవాలని కోరుతోంది విజయవాడకు చెందిన కొండా పల్లవి.

Pallavi: విజయవాడకు చెందిన కొండా పల్లవి నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. మూడో తరగతి నుంచే తన ఉన్న ప్రతిభను వివిధ వేదికలపై ప్రదర్శించేంది. పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేది. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై దీర్ఘంగా ఆలోచేంచే పల్లవి..చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న ఘటనలపై స్పందించింది. వాటిపైన స్వతహాగా విషయాలను సేకరించి, వాటికి అడ్డుకట్ట ఎలా వేయాలనే అంశాలను చెప్పేంది. పలు ఛానళ్లలో జరిగిన చిన్న పిల్లల కార్యక్రమాలకు కూడా హాజరై ఈ అంశాలపై మాట్లాడేది. ఈ క్రమంలోనే తనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన అమ్మ రమణ కుమారి, పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. కేవలం పబ్లిక్ స్పీచ్ లే కాకుండా కళలపై ఆసక్తి పెంచుకున్న పల్లవి.. కొన్నేళ్ల నుంచి నృత్యం, సంగీతం నేర్చుకుంటోంది.

Pallavi: పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ప్రపంచ రికార్డును పల్లవి నమోదు చేసింది. 60 నిమిషాల్లో... 60 అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఔరా అనిపించింది. ఛాంపియన్ రికార్డ్ లో తన పేరును ఎక్కించింది. ఇవే కాకుండా అబాకస్ లోనూ జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టింది. మెుదట బాలసిరోమణి అవార్డును గెలుచుకున్న పల్లవి..ఆ తర్వాత అనేక పోటీల్లో నెగ్గి అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 62 అవార్డులు, 145 ప్రశంసా పత్రాలు పొందినట్లు తెలిపింది. తన కూతురు స్థాయిలో రాణించటం సంతోషంగా ఉందని ఆమె తల్లి... రమణ కుమారి చెబుతున్నారు. స్వశక్తి మీదనే ఎదగాలని పల్లవి ఎప్పుడు ఆలోచిస్తోందని తెలిపారు. ఐఏఎస్ కావాలన్న ఆమె లక్ష్యం కోసం...ప్రభుత్వం సాయం చేయాలని కోరారు..

"జీవితం ఎదుగుదలలో కేవలం చదువు మాత్రం ఉంటే సరిపోదనేది నా ఆలోచన. ఈ క్రమంలో బహుముఖంగా రాణించాలని నిర్ణయించుకున్నాను. అందుకే పబ్లిక్ స్పీచ్​లతో రాణిస్తూనే... సంగీతం, నృత్యాన్ని నేర్చుకుంటున్నా. వీటితోనైనా జీవితంలో రాణించవచ్చనేది నా అభిప్రాయం. పేద ప్రజలకు సేవ చేయాలనే ఐఎఎస్ ఎంచుకున్నాను. అయితే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నా" -కె. పల్లవి, విజయవాడ

Pallavi: నగరంలోని బాలభవన్​లో ఏడేళ్ల క్రితం పల్లవి సంగీతం నేర్చుకునేందుకు చేరింది. శ్రద్ధగా సంగీత పాఠాలు వింటూనే వేగంగా అందులోని మెళుకువలు నేర్చుకుంది. ఈ అమ్మాయి రాణిస్తున్న తీరు చూసి పలువులు విద్యార్థులు సైతం అబ్బురపోతున్నారు. పల్లవి ఎంతో మంది పిల్లలకు ఆదర్శమని.. బాలభవన్​ ఉపాధ్యాయులు ఆర్బీ శ్రీవాస ఆచార్యులు అంటున్నారు.

ఇదీ చదవండి:

‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడింది... ఊరికి బస్సు తెచ్చింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.