రాష్ట్రవ్యాప్తంగా స్థానికసంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలి రోజున శ్రీకాకుళం జిల్లా జడ్పీటీసీ స్థానాలకు రెండు.. ఎంపీటీసీ స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం జిల్లా జడ్పీటీసీలకు రెండు... ఎంపీటీసీలకు 14 నామినేషన్లు దాఖలయ్యాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానానికి 9 దరఖాస్తులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో జడ్పీటీసీలకు రెండు... ఎంపీటీసీలకు 93 నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీలకు ఐదు... ఎంపీటీసీలకు 61 నామినేషన్లు దాఖలయ్యాయి.
కృష్ణా జిల్లాలోని నామినేషన్ల ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయటంతో... నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారు వెనుదిరిగారు. సమాచారం ఆలస్యంగా అందటంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. మొత్తం మీద తొలి రోజున జడ్పీటీసీలకు రెండు... ఎంపీటీసీలకు 50 నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో జడ్పీటీసీలకు రెండు... ఎంపీటీసీలకు 32 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రకాశం జిల్లాలో జడ్పీటీసీలకు ఆరు... ఎంపీటీసీలకు 43 నామినేషన్లు దాఖలయ్యాయి.
కర్నూలు జిల్లాలో తొలిరోజున ఎంపీటీసీలకు 37 నామినేషన్లు దాఖలయ్యాయి. కడప జిల్లాలో జడ్పీటీసీస్థానాలకు తొలిరోజున 6 నామినేషన్లు దాఖలవగా.... అవన్నీ వైకాపా అభ్యర్థులు వేసినవే. చిత్తూరు జిల్లాలో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. జడ్పీటీసీలకు 24... ఎంపీటీసీలకు 213 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలకు తొలిరోజున 78 నామినేషన్లు అందాయి.