ETV Bharat / city

పిల్లలకు ఇచ్చే మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచాలి: రామ్మోహన్ - mp rammohan naidu'

రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు ఇచ్చే మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తక్షణ ఉపశమనంగా రూ.3 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

mp rammohan naidu wrote a letter to cm jagan
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు
author img

By

Published : May 29, 2021, 10:29 PM IST

కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫిక్స్​డ్ డిపాజిట్ మొత్తాన్ని రూ.10 లక్షలు నుంచి రూ.25లక్షలకు పెంచాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు.

పథకం లబ్ధిదారులకు రుజువుగా కొవిడ్ పాజిటివ్ టెస్టుతో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని అంగీకరించాలని కోరారు. తక్షణ ఉపశమనంగా పిల్లలకు రూ.3 లక్షలు చెల్లించాలన్నారు. గ్రాడ్యుయేషన్ వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పరీక్షల నిర్వహణతో విద్యార్థులను ప్రమాదంలోకి నెడతారా?: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.