దిల్లీ మెడలు వంచుతామని శపథాలు చేసి..అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసునని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో 28 ఎంపీలు ఉన్నా..ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించకుండా.. ప్రతిపక్షం సమావేశాల్లో ఏమీ మాట్లాడలేదంటూ విజయసాయిరెడ్డి దద్దమ్మ కబుర్లు చెబుతున్నారని.. వారి వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారని ఎద్దేవా చేశారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ఎంపీలకు విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి.. ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి తమకుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: