పురపాలిక ఎన్నికలంటే వైకాపాకు ఎందుకంత భయమని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. 'నా నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు. నాపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని కోరా.' అన్ని కేసులపై కలిపి క్వాష్ పిటిషన్ వేస్తా. నాపై జరిగే కుట్రలో తాడేపల్లివారు ఉన్నారని అనుమానం ఉంది.' అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
తప్పుడు కేసులు పెట్టిన వారిపై స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇస్తాను. కులం తరఫున మాట్లాడిన ఏయూ వీసీని గవర్నర్ తొలగించాలి. ఎంపీగా నాకుండే హక్కులు కాలరాసేందుకు తితిదే ఛైర్మన్ ఎవరు..? నాపై దాడులు, కుట్రను ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.
- రఘురామకృష్ణరాజు, ఎంపీ
ఇదీ చదవండి: పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు