దుర్గ గుడి అవినీతిలో అసలు దోషులు మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన ఉన్నతాధికారులను బర్తరఫ్ చేయకుండా చిరుద్యోగులుపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దుర్గగుడిలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన దాడుల్లో అధికారులు అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంత్రి అవినీతిపై స్పందించి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూర్చాలని కోరారు.
ఇదీ చదవండి: