తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు, దర్శక-నిర్మాతలతో సీఎం చర్చించనున్నారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు వాటిల్లిన నష్టం, పునరుత్తేజం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకురానున్నారు. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు సీఎంను కలవనున్నారు.
ముఖ్యంగా థియేటర్లు, టికెట్ ధరలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారంలో ఈ సమావేశం జరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీఎం జగన్ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: