కృష్ణా మిల్క్‌యూనియన్ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ అధ్యక్షునిగా చలసాని ఆంజనేయులు మళ్లీ ఎన్నికయ్యారు. ఈనెల 18న జరిగిన డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో చలసానితోపాటు అతని ప్యానల్ డైరెక్టర్లు గెలుపొందారు. విజయవాడలోని విజయ డెయిరీ ఆవరణలో పాలకవర్గ సమావేశంలో ఆంజనేయులు మరోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు డెయిరీ డైరెక్టర్లకు చలసాని కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారుని వద్ద తీసుకుని మొత్తంలో 85 శాతం మొత్తం రైతులకు అందజేస్తోదందని చెప్పారు.
తాను ఛైెర్మన్ అయ్యే నాటికి 618 కోట్ల రూపాయలు ఉండే టర్నోవర్ ని రెండున్నర యేళ్లల్లో 920 కోట్లకు తీసుకెళ్లామని అన్నారు. రైతులు, వినియోగదారులను విజయ డెయిరీ రెండు కళ్లుగా ముందుకెళ్తున్నామని చెప్పారు. రైతులకు మంచి ధర ఇవ్వడంతో పాటు వారికి మరింత అండగా నిలవాలనేది తమ ఆలోచన అని చెప్పారు. త్వరలో కొత్త పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే రెండున్నర ఏళ్ల తన పదవీ కాలంలో విజయ డెయిరీ మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాయతంగా పనిచేస్తానని తెలిపారు. భవిష్యత్తులో రైతులు లీటరుకు మద్దతు ధరగా వంద రూపాయల ధర వచ్చేలా చూస్తామన్నారు.
ఇదీ చదవండి: