ETV Bharat / city

మొబైల్​ క్వారంటైన్​ బస్సులు.. త్వరగా కరోనా పరీక్షలు

దూర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులకు వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు స్వాబ్​ టెస్ట్​ మొబైల్​ వాహనాలను ప్రారంభించినట్లు కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ తెలిపారు. ఇంటెలిజెంట్​ మానిటరింగ్​ సర్వీస్​ క్వారంటైన్​ పేరిట వీరా టెక్నాలజీ సంస్థ మూడు బస్సులను నెల రోజుల పాటు ఉచితంగా అందించింది.

మొబైల్​ క్వారంటైన్​ బస్సులు.. త్వరగా కరోనా పరీక్షలు
మొబైల్​ క్వారంటైన్​ బస్సులు.. త్వరగా కరోనా పరీక్షలు
author img

By

Published : Jun 2, 2020, 5:30 PM IST

రైలు, విమాన మార్గాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు త్వరగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ సౌత్‌ టెర్మినల్‌ వద్ద... గన్నవరం విమానాశ్రయంలోనూ మొత్తం మూడు స్వాబ్‌ టెస్ట్‌ మొబైల్‌ వాహనాలను ప్రారంభించారు. ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ అనాలిసిస్‌ సర్వీస్‌ క్వారంటైన్‌ పేరిట వీరా టెక్నాలజీ సంస్థ మూడు బస్సులను కృష్ణా జిల్లాలో నెలరోజులు పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు అందించింది.

గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులతోపాటు... రైలు ప్రయాణికులకు ఈ బస్సుల సహాయంతో అక్కడికక్కడే స్వాబ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక గంటలో 300 మంది నుంచి స్వాబ్‌ శాంపిల్స్‌ తీసుకునేలా ఈ ప్రత్యేక బస్సుల్లో ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి.. ఎల్జీ పాలిమర్స్ విషాదంలో మరొకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.