MLC Ashok Babu: ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం నిలబెట్టుకోకపోగా.. చేసిన పనికి జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఏ వ్యవస్థను కదిపినా ఉద్యోగులు బలిపశువుల్లా మారుతున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో జగన్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. 13 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వకుండా.. ఏపీలో అంతా బాగుందని దావోస్‌లో కథలు చెప్తే నమ్మే మేథావులు ఎవ్వరూ లేరని విమర్శించారు. కట్టుకథలకే ఆర్థికమంత్రి పరిమితమవుతున్నారన్న అశోక్ బాబు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఔట్ సోర్సింగ్ చిరుద్యోగి వరకూ ఉద్యోగ సంబంధిత బాకీలపై... ఆర్థిక మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: